Rains: నగరంలో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.


Published Aug 15, 2024 08:07:01 PM
postImages/2024-08-15/1723732621_hyrains.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నగరంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాన కురుస్తుండడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమైయారు. సిటీలో కొన్ని చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ ఉంది.  

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad rains rain-alert

Related Articles