Google Pay:గూగుల్ పేలో పేమెంట్ హిస్టరీ డిలీట్ ఎలా చేయాలంటే.?

ప్రస్తుత కాలంలో చాలామంది మనీ పేమెంట్ యాప్ అయినటువంటి గూగుల్ పేను ఉపయోగిస్తూ ఉంటారు.  ఒక్కసారి గూగుల్ పేలో పేమెంట్ చేసిన మరియు మనకు వారు డబ్బులు పంపిన  ఆ


Published Aug 14, 2024 07:55:34 PM
postImages/2024-08-14//1723645534_gpay.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది మనీ పేమెంట్ యాప్ అయినటువంటి గూగుల్ పేను ఉపయోగిస్తూ ఉంటారు.  ఒక్కసారి గూగుల్ పేలో పేమెంట్ చేసిన మరియు మనకు వారు డబ్బులు పంపిన  ఆ డేటాను డిలీట్ చేయడం చాలా కష్టం. అది ఎన్ని సంవత్సరాలు అయినా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి గూగుల్ పే లో డేటా కనిపించకుండా డిలీట్ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఆ ఆప్షన్ కూడా ఉందట. ఒకప్పుడు ఏదైనా షాపింగ్ చేయాలంటే జేబు నిండా డబ్బులు లేదంటే బ్యాగులో డబ్బులు పెట్టుకొని వెళ్లేవారు.

ఆ పని లేకుండా ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పే అమెజాన్ వంటి ఎన్నో పేమెంట్ యాప్ లు మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటుగా ఆయా బ్యాంకుల ఖాతాదారులకు కూడా వాటి సొంత యూపీఐ పేమెంట్స్ యాప్స్ ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు డబ్బు చెల్లింపు చాలా ఈజీ అయిపోయినది..  మొబైల్ నెంబర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లో డబ్బులను చెల్లిస్తున్నారు, తీసుకుంటున్నారు.

 అలా మనం అలా మనకు క్రెడిట్ అయిన డబ్బులు మరియు డెబిట్ అయినా డబ్బులు హిస్టరీ  యాప్ లో తప్పనిసరిగా ఉంటుంది. కానీ అది డిలీట్ చేయడం అనే ఆప్షన్ లేదు.  కానీ గూగుల్ పే  యాప్ లో హిస్టరీ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ పే ప్రొఫైల్ ను ఓపెన్ చేయాలి.  ఆ తర్వాత సెట్టింగ్స్ లో వెళ్లి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పై క్లిక్ చేయాలి.  ఆ తర్వాత  data &personalization ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గూగుల్ అకౌంట్ అనే లింకుపై క్లిక్ చేయాలి.  

దీని తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ ఎక్స్పీరియన్స్ పేజీని కిందికి స్క్రోల్ చేస్తే గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది.  ఇందులో మీకు వద్దనుకున్నటువంటి లావాదేవీలను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయవచ్చు.  అంతేకాదు అవసరం అనుకుంటే టైం ప్రేమను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా డేటా మొత్తాన్ని ఒకేసారి డిలీట్ కొట్టవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line googlepay history-delete phone-pay

Related Articles