సాధారణంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలుపెట్టిన తేదీ టైం అన్ని చూసుకుంటారు. ముఖ్యంగా ఇల్లు కట్టాలంటే మన కట్టే స్థలంలో అన్ని కరెక్ట్ సెట్ అయి వాస్తు సెట్ అయితేనే ఇల్లు కడతారు. అలా
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలుపెట్టిన తేదీ టైం అన్ని చూసుకుంటారు. ముఖ్యంగా ఇల్లు కట్టాలంటే మన కట్టే స్థలంలో అన్ని కరెక్ట్ సెట్ అయి వాస్తు సెట్ అయితేనే ఇల్లు కడతారు. అలా మీరు ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వాస్తు ప్రకారం లేకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయట. మరి మీ ఇల్లు వాస్తు ఉందా లేదా తెలిపే కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం కట్టుకున్న ఇండ్లలో సంతోషం వెల్లివిరీయడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయట. కొంతమంది జాతకం ఎంత బాగున్నా వాస్తనేది సరిగా లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయట. అలా మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే మాత్రం తప్పకుండా ఈ సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా చాలామంది ఆ ఇంట్లోకి వెళ్ళగానే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారట.
అంతేకాదు విపరీతమైన అప్పులై అవి తీరకుండా ఉంటాయట. అలాగే అనారోగ్య సమస్యలు తీవ్రమైపోయి చివరికి ప్రాణాల మీదికి వస్తుందట. అలాగే చిన్న చిన్న విషయాలకి కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు అయ్యి విడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయట. అంతేకాదు ఆ ఇంట్లోకి వస్తే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారట. కాబట్టి ఇంటి స్థలాలు కొనేముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా టెంపుల్స్, స్మశానాలు ఉన్న ప్రాంతాలలో ఇల్లు కట్టుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా స్త్రీలు తరచూ ఏడ్చే ఇంట్లో కూడా వాస్తు దోషాలు ఉంటాయట. అంతేకాదు ఇంట్లో ఉండే కుక్క కూడా ఒకవైపు తిరిగి అరిస్తే ఆ ఇల్లు వాస్తు దోషం ఉన్నట్టేనట. కాబట్టి ఇలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తే వాస్తు దోషాలు ఉన్నాయని గ్రహించుకొని వాటిని సెట్ చేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.