ప్రస్తుత కాలంలో రోగాలు అనేవి చిన్న ఏజ్ లోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తింటున్న ఫుడ్, పెరిగే వాతావరణం అని చెప్పవచ్చు. మన తాతల కాలంలో కనీసంలో కనీసం 90 నుంచి 100
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో రోగాలు అనేవి చిన్న ఏజ్ లోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తింటున్న ఫుడ్, పెరిగే వాతావరణం అని చెప్పవచ్చు. మన తాతల కాలంలో కనీసంలో కనీసం 90 నుంచి 100 ఏళ్ళు బ్రతికేవారు. వారికి ఎలాంటి రోగాలు వచ్చేవి కావు. ఇప్పుడు కనీసం గట్టిగా 40 సంవత్సరాలు ఏ రోగం లేకుండా బతకలేకపోతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి మెల్లిగా వచ్చి ఏర్పడకుండానే మనల్ని కబలిస్తుంది. కాబట్టి ఈ కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పక క్యాన్సర్ ఉన్నట్టు గ్రహించుకోవాలి. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం.
ఈ పేరు వినగానే చాలామంది వణికిపోతారు. ప్రస్తుత కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేజ్, గర్భాశయ, రొమ్ము, ప్రేగుల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే కాకుండా బోన్ క్యాన్సర్లు కూడా చాలామంది ఇబ్బందులు పెడుతున్నాయి. ఏదైనా ఎముకలు నిరంతరంగా నొప్పి వచ్చినట్లయితే ఎముక క్యాన్సర్ ప్రారంభానికి సంకేతం. ఆ నొప్పి మరింత ఎక్కువైతే విశ్రాంతి తీసుకున్న తగ్గకపోతే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలట. ఇక మీకు ఎముక క్యాన్సర్ వచ్చినట్లయితే వాపు గడ్డలు అనేవి ఏర్పడతాయి. ఎముకల క్యాన్సర్ కారణంగా చాలా బలహీనంగా అవుతారు. చిన్న రాయి తగిలిన ఎముకలు విరిగిపోతాయి.
అంతేకాదు ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల ఈజీగా పగుళ్లు పడతాయి. అంతేకాకుండా మీకు రాత్రి సమయంలో చల్లని ప్రదేశంలో కూడా చెమట పడితే, తరచూ జ్వరం వచ్చిన ఎముక క్యాన్సర్ ఉన్నట్టు గ్రహించుకోవాలి. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం తగ్గుతూ వస్తుంది. ఇక కొంతమంది సడన్ గా బరువు తగ్గడం , ఎముక భాగాల్లో నొప్పి రావడం అలా రోజు రోజుకు పెరుగుతూ పోతే మాత్రం తప్పనిసరిగా వైద్యులకు చూపించుకోవాలి. క్యాన్సర్ ఎక్కువగా తొడలు, వెన్నెముక, కాళ్లకు వ్యాపిస్తూ ఉంటుంది.