Alchohal:ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మద్యం మానేయండి.!

ప్రస్తుత కాలంలో చాలా మందికి మద్యం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. కొంతమంది అయితే మద్యం తాగకుండా  కనీసం ఏ పని కూడా చేయలేరు. అలా తాగి వారి శరీరం సహకరించకుండా అవుతుందట. అలా మద్యానికి బానిస అవుతున్నాం అని  మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుందట. ఎక్కువగా అలవాటు పడితే వారి శరీరం ఏ విధంగా తయారవుతుంది అనే వివరాలు చూద్దాం.


Published Aug 23, 2024 07:39:40 AM
postImages/2024-08-23/1724378980_alchohal.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మందికి మద్యం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. కొంతమంది అయితే మద్యం తాగకుండా  కనీసం ఏ పని కూడా చేయలేరు. అలా తాగి వారి శరీరం సహకరించకుండా అవుతుందట. అలా మద్యానికి బానిస అవుతున్నాం అని  మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుందట. ఎక్కువగా అలవాటు పడితే వారి శరీరం ఏ విధంగా తయారవుతుంది అనే వివరాలు చూద్దాం.

మద్యపానానికి ఎక్కువగా బానిస అయిన వారు  వారి యొక్క శరీరంపై కంట్రోల్ కోల్పోతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, సరైన పద్ధతిలో నిలబడలేకపోవడం , ఇదే కాకుండా అత్యధికంగా చెమట రావడం, వికారం వంటివి ఏర్పడడం కనిపిస్తాయి. మద్యానికి ఎక్కువగా బానిసైతే వారికి కొద్దిగా తాగితే సరిపోదు. తాగినప్పుడల్లా ఫుల్లుగా తాగాలనిపిస్తుందట. సందర్భాన్ని బట్టి మద్యం తాగడం వేరు, బాధ వచ్చినా ఆనందంగా వచ్చిన ఇంకా ఏ విషయంలో అయినా అతిగా మద్యం తాగడానికి ప్రిపరేషన్ ఇచ్చారంటే  మీరు బానిస అయినట్టే. మీరు తాగిన సమయంలో ఏదైనా మాట్లాడి దాన్ని ఉదయాన్నే మర్చిపోయారు అంటే  మీరు మద్యం మానేయాలని అర్థం.

లేదంటే మెదడు పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కొంతమంది మద్యం తాగి కంట్రోల్ తప్పి కుటుంబ సభ్యులతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. ఇలా తరచూ జరిగితే మాత్రం మీరు మద్యం మానేయాలని అర్థం చేసుకోవాలి. ఇవే కాకుండా  ఆహారం తినకపోవడం, బలహీనంగా అయిపోవడం  ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే మీరు మద్యానికి బానిస అయ్యారని శరీరం ముందుగానే హెచ్చరిస్తోంది.  కాబట్టి ఈ లక్షణాలు ఉంటే మద్యం పూర్తిగా మానేయడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu alchohal drink body-damage family-fight

Related Articles