వరదల నుంచి ప్రజలను కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. హెలికాప్టర్ గురించి ట్రై చేసినా దొరకలేదని ఓ మంత్రి చెప్తున్నాడు హెలికాప్టర్ దొరకలేదంటే అయిన మంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా.. అని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: నిన్న మొత్తం సీఎం రేవంత్ రెడ్డి నిద్రపోయారా అని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఖమ్మంలో పర్యటిస్తున్న అంశంపై ఆయన స్పందించారు. నిన్నంతా వరదల్లో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మంత్రి కూడా కనిపించలేదని ఆయన అన్నారు.
వరదల నుంచి ప్రజలను కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. హెలికాప్టర్ గురించి ట్రై చేసినా దొరకలేదని ఓ మంత్రి చెప్తున్నాడు హెలికాప్టర్ దొరకలేదంటే అయిన మంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా.. అని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా విఫలమైనందుకు రాజీనామా చేస్తారా మరి? అని ప్రశ్నించారు. భారత ప్రభుత్వానికి చెందిన వందల హెలీకాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. బేగంపేట నుంచి హెలికాఫ్టర్ తీసుకొని వెళ్లినా కేవలం 40 నిమిషాలలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి తీసుకొని వచ్చేవారని ఆయన అన్నారు.