పర్వత ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవితం చాలా కష్టమని ఆమె తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి దుర్ఘటనలు వచ్చి హిమాచల్ ప్రదేశ్ ప్రజల ప్రాణాలను, ఆస్తులను నాశనం చేస్తున్నాయని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: కేరళ తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్, కేదార్, గంగోత్రి ప్రాంతాల్లో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. డ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వస్తున్న విషయం తెలిసిందే. మండీ, శిమ్లా, కులు జిల్లాల్లో సుమారు 50 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా వరదల్లో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు.
ఈ వరదల ఘటనపై బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. పర్వత ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవితం చాలా కష్టమని ఆమె తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి దుర్ఘటనలు వచ్చి హిమాచల్ ప్రదేశ్ ప్రజల ప్రాణాలను, ఆస్తులను నాశనం చేస్తున్నాయని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై నివేదికలను తీసుకొని పరిశీలిస్తున్నారని కంగన అన్నారు. సహాయ నిధుల ద్వారా మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. చేయగలిగినంత సహాయం కోసం వివిధ శాఖల మంత్రులను కూడా కలుస్తానని అన్నారు. త్వరలోనే హిమాచల్‌ను సందర్శిస్తానని.. అక్కడి ప్రజలను కలిసి అండగా ఉంటానని కంగన వెల్లడించారు.