VIRAL VIDEO : ఓమ్మీ నడిపిన కేసీఆర్ 2024-06-27 15:24:06

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వాహ‌నాన్ని న‌డిపారు. బుధ‌వారం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కొన్ని నెల‌ల క్రితం కేసీఆర్ కాలు బెనికిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంత‌రం క‌ర్ర స‌హాయంతో న‌డిచారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నారు. క‌ర్ర స‌హాయం లేకుండానే న‌డుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే డాక్ట‌ర్లు ఆయ‌న‌కు మాన్యువ‌ల్ గా న‌డిచే వాహ‌నాన్ని న‌డిపించాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆయ‌న త‌న పాత ఓమ్నీ వ్యాన్ న‌డిపించారు. 

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. కేసీఆర్ దేశాన్నే న‌డిపించ‌గ‌ల స‌మ‌ర్థ‌వంత‌మైన‌ నాయ‌కుడు..ఆయ‌న ఓమ్నీ వాహ‌నాన్ని న‌డిపించ‌లేరా...అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రో నెటిజ‌న్ కేసీఆర్ బైక్ కూడా న‌డిపిస్తే చూడాల‌ని ఉందంటూ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే గులాబీ బాస్ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిరాశ‌ప‌ర్చ‌డంతో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. 

 


https://x.com/NewsLineTelugu/status/1806261409052860557