Kishan reddy: వరద ప్రభావంపై మోడీ ఆరా తీశారు

రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్ చేసి మాట్లాడారని ఆయన వెల్లడించారు. 
 


Published Sep 03, 2024 05:35:18 PM
postImages/2024-09-03/1725365118_Kishanreddyinbjpoffice.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పలువురు పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్ చేసి మాట్లాడారని ఆయన వెల్లడించారు. 

వరద సహాయక చర్యల కోసం NDRF బృందాలను కూడా పంపించారని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉందని ఆయన వెల్లడించారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వరదలతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నానని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు బీజేపీ శ్రేణులు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news revanth-reddy news-line newslinetelugu tspolitics telanganam narendra-modi kishan-reddy

Related Articles