Bangladesh: బంగ్లాదేశ్ నిరసనలో విరాట్ కోహ్లీ డూప్..!

ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. విద్యార్ధులు వామీ లీగ్ పార్టీకి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు, అందోళన చేపట్టారు.


Published Aug 07, 2024 05:21:00 PM
postImages/2024-08-07/1723032860_VIRAT.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బంగ్లాదేశ్ ఇప్పుడు తగలబడిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ గొడవలతో సతమతమవుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. విద్యార్ధులు వామీ లీగ్ పార్టీకి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు, అందోళన చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందోళన కారులను మాత్రం శాంతపరచలేకపోతున్నారు. పరిస్థితులు అదుపులో లేకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రత్యేక విమానంలో భారత్‌కు పారిపోయి వచ్చారు. బంగ్లాదేశ్‌లో పాలన సైన్యం చేతిలోకి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితులు చల్లారలేదు. విద్యార్ధులు , ఆడవాళ్లను , చిన్నపిల్లలపై దాడులు చేపడుతున్నారు.


ఇలాంటి టైంలో  బంగ్లాదేశ్ లో విరాట్ కొహ్లి  నిరసన తెలిపిన వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలి ఉన్న ఓ వ్యక్తి ఈ నిరసనలో పాల్గొన్నాడు. డూప్ అని క్లియర్ గా తెలుస్తున్నా ...సోషల్ మీడియా మాత్రం విరాట్ కాదని తేల్చి చెప్పేశారు. రాయల్ ఛాలెంజర్స్ క్యాప్‌ను ధరించి ఆందోళనలో పాల్గొన్నాడు. షేక్ హసీనా రాజీనామా తర్వాత అక్కడి విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లోనే ఈ కొహ్లి డూప్ కనిపించారు.

 

Related Articles