Megastar : మెగాస్టార్ చిరంజీవి వర్కవుట్ తర్వాత ఏం తింటారో తెలుసా?


Published Aug 30, 2024 06:49:50 AM
postImages/2024-08-30/1725018523_Chiru.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి గురించి భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. 70వ దశకంలోకి అడుగు పెట్టినా.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ.. చురుగ్గా స్టెప్పులేయగలరు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చిరంజీవి డ్యాన్స్ అంటే క్రేజ్ మాత్రం తగ్గలేదు. అసలు అంత యాక్టీవ్ గా ఉండటానికి, అంత ఈజీగా స్టెప్పులేయడానికి మెగాస్టార్ ఏం డైట్ ఫాలో అవుతారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా? ఈ స్టోరీ చదివేయండి.

నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తున్న మెగాస్టార్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నటన, డైలాగుల మీద పట్టు పెంచుకొని నటన మీదున్న ప్రేమతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 

  • ప్రతిరోజూ ఒకే రకమైన టైమ్ టేబుల్ పాటించడం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ కి ముఖ్య కారణం. పని, వ్యాయామం, ఫుడ్ అన్నీ ఒక టైమ్ తగ్గట్టు ఫాలో అవుతారు.
  • ప్రతిరోజూ వ్యాయామం, యోగా, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఫిట్ నెస్ ని కాపాడుకునేందుకు ఆయన నిత్యం వర్కవుట్లు చేస్తారు.
  • మానసిక ఆరోగ్యం మనిషి విజయానికి తొలిమెట్టు అంటారు చిరంజీవి. అందుకే ప్రతిరోజూ మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా చేస్తారాయన.
  • ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా.. కుటుంబంతో సమయం గడపాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనతో కలిసి నిలబడే కుటుంబానికి సమయం ఇవ్వడం అన్నింటికంటే ముఖ్యమైన పని అంటారు చిరు.
  • ఎన్ని గంటలు పనిచేసినా.. ఎన్ని రకాల షూటింగులతో బిజీ ఉన్నా ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలంటారు చిరంజీవి. ఈ సూత్రాన్ని ఆయన ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే 70 ఏళ్లు వచ్చినా ఇంకా యంగ్ హీరోలాగే కనిపిస్తారు.
  • శరీరానికి యోగా, వర్కవుట్లు ఎలాగో.. మెదడుకు రీడింగ్, మ్యూజిక్, ట్రావెలింగ్ అలాంటి వర్కవుట్లే. అందుకే ప్రతిరోజూ పుస్తక పఠనం, సంగీతం వినడం మిస్ అవరు.
  • మెగాస్టార్ ఆంజనేయుడి భక్తుడు. ప్రతిరోజూ పూజ చేసుకోవడం, ఖాళీ సమయం దొరికినప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం ఆయనకు అలవాటు.
  • ఇక ఫుడ్ విషయానికొస్తే.. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు సమానంగా తీసుకుంటారాయన.
  • శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటే ఆరోగ్యం సగం కాపాడుకున్నట్టే. అందుకే ప్రతిరూ ఆయన శరీరానికి కావాల్సినంత నీరు తాగుతారు. నిత్యం హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి పోరు. వాటికి బదులు ఏదైనా పండు తినడం ఉత్తమం అంటారాయన.
  • రుచిగా ఉందని ఎక్కువగా తినడం.. రుచి లేదని తక్కువగా తినడం సరికాదంటారు టాలీవుడ్ బాద్ షా. అందుకే.. మితంగా.. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చేంత మాత్రమే తినాలి అని సూచిస్తారాయన.
  • సాంప్రదాయ రుచులు, స్థానిక రుచులకు ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి స్థానిక ఫుడ్ ఏంటో తెలుసుకొని మరీ రుచి చూస్తారు.
  • ఆయన అల్పాహారంలో ఎక్కువగా ఇడ్లీలు, దోసెలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటాయి.
  • లంచ్, డిన్నర్ సమయంలో వీలైనంత వరకు తెలుగు భోజనానికే తొలి ప్రాధాన్యతనిస్తారు. పులిహోర, పప్పు, సాంబార్, చేపలు, చికెన్ అంటే ఆయనకు చాలా ఇష్టం.
  • స్నాక్స్ సమయంలో బజ్జీలు, ఇతర నూనె వస్తువులు కాకుండా ఎనర్జీ డ్రింక్స్, పండ్లు, మొలకెత్తిన గింజలు తింటారు.
  • ప్రతిరోజూ రాత్రి 8-9 లోపు డిన్నర్ పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత ఓ గంటకి నిద్రకు ఉపక్రమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టైమింగ్ ని ఆయన మిస్ అవరు.
  • ప్రతిరోజూ వర్కవుట్లతో పాటు గార్డెనింగ్, డ్యాన్స్ ప్రాక్టిసింగ్ తప్పకుండా చేస్తారు.  అందుకే ఆయన ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా పోటీనిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi mega-family viral-news life-style healthy-food-habits latest-news

Related Articles