మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైన విషయం తెలిసిందే. ఇలా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వరల్డ్ బ్యూటీస్. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివెరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్‌లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది.
అయితే శిల్పారామంలో ఉదయం ఎనిమిదిన్నరకే చేరుకున్నారు.. రెండుగంటల పాటు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆడిపాడారు. బతుకమ్మ ఆటలు ఆడుతూ ఆకట్టుకున్నారు. బృందావనంలో బాలగోపాలుడు గోపికల ఆటలను చూశారు. బొమ్మలకు రంగులద్ది సరదాగా గడిపారు.మహిళా శక్తి బజార్లోని స్టాళ్లను చూశారు. మంత్రి సీతక్క పాల్గొని మిస్ వరల్డ్ కంటిస్టెంట్స్కు అభినందనలు తెలిపారు.