Kova lakshmi: పార్టీ వీడేది లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే 2024-06-27 15:03:47

న్యూస్ లైన్ డెస్క్: తను బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వ‌స్తున్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మి స్పందించారు. పార్టీ మారుతున్నార‌న్న వార్తలను ఆమె ఖండించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. రాజ‌కీయాల్లో ఉన్నంత‌కాలం బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని తెలిపారు. కొంత మంది కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా తనతో పాటు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. కొంతమంది అనేక పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వెళ్లిపోతున్నారని విమర్శించారు. మాజీ స్వీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కడియం శ్రీహరి, కేశవరావు, సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్‌ అధితనే కేసీఆర్‌ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. పార్టీని విస్మరించి వ్యక్తిగత అవసరాల కోసం ఇతర పార్టీలు మారడం చాలా దుర్మార్గం అన్నారు. తను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.