కేంద్ర ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్) చట్టాలను తీసుకువచ్చారు. ఈ నూతన చట్టాలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించిన 77 ఏండ్ల తర్వాత మన నేర న్యాయ వ్యవస్ధ పూర్తిగా స్వదేశీగా మారిందన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్‌సభలో 34 మంది సభ్యులతో 6 గంటలకు పైగా చర్చలు జరిపి, బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపక్షం మీడియా ముందు వచ్చి ఈ చట్టాలను తప్పుబడుతున్నారని షా విమర్శించారు.