ఈ సెప్టెంబర్ లో కొన్ని కార్లు మార్కెట్ ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాయి. ఏ కార్లు ..ఫీచర్స్ ఏంటి చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాటా మోటర్స్ , హ్యుందాయ్ , ఎంజి , మెర్సిడెస్ -బెంజ్ కార్లు అప్ డేట్ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నాయి. తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ కు రెడీగా ఉన్నాయి . ఈ సెప్టెంబర్ లో కొన్ని కార్లు మార్కెట్ ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాయి. ఏ కార్లు ..ఫీచర్స్ ఏంటి చూసేద్దాం.
* ఎంజీ మోటర్ ఇండియా
MG మోటార్ ఇండియా తన మూడవ ఎలక్ట్రిక్ వెహికల్ విండ్సర్ ఈవీని మార్కెట్లోకి వదులుతుంది. దీని ప్రారంభ తేదీ సెప్టెంబర్ 11. ఈ కారు బ్యాటరీ ప్యాక్ 460 కిమీ పరిధిలో 37.9kWh యూనిట్ 360 కి.మీల పరిధిని కలిగి ఉంది. 136 హార్స్ పవర్ తో బండి ముందుకు వెళ్తుంది. ఈ డీసీ ఛార్జర్ తో జస్ట్ 30 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్ పెట్టొచ్చు.
* హ్యుందాయ్ 2024 అల్కాజర్
హ్యుందాయ్ 2024 అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ను ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 26న , కారు కంపెనీ అఫిషియల్ గా లాంచ్ చేయడానికి ముందే ఇంటీరియర్ పిక్స్ ను షేర్ చేసింది. అది కూడా మోడ్రన్ శాంటా ఫే, ఎక్స్ టెర్, క్రెటా లాగా ఉంటుంది. దీని క్యాబిన్ కూడా క్రెటా లాగే ఉంటుది, డ్యూయల్ జోన్ టెంపరేచర్ కూడా ఉంది. నోబెల్ బ్రౌన్ , హేజ్ నేవీ బ్లూ రంగులో వస్తుంది.
*మెర్సిడెస్-బెంజ్
ఫారన్ లో ఇప్పటికే ఉన్న మెర్సిడెస్-మేబ్యాక్ EQS 680 రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 107.8kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 600 కి.మీల వరకు వెళ్లగలదట. 950 Nm గరిష్ట టార్క్, 658 PS ఈ మోటార్ల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. దీనితో లగ్జరీ మేబ్యాక్ 210 mph హై స్పీడ్ ను మ్యానేజ్ చేస్తుంది. 4.4 సెకన్లలో 0 నుండి 100 mph వేగాన్ని అందుకోగలదు. మేబ్యాక్ EQS దాని గరిష్ట 22kW AC ఛార్జింగ్ ,200kW DC రాపిడ్ ఛార్జింగ్ సామర్థ్యాలతో 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది.
*టాటా మోటార్స్ కర్వ్
సెప్టెంబర్ 2, 2024న కొత్త కర్వ్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. త్రీ ఇంజిన్ పవర్ తో నడుస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండోది. ఇక మూడోది ఏంటంటే 120 హార్స్‌పవర్, 170 Nm టార్క్‌తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్. ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రతి ఇంజిన్‌కు అందుబాటులో ఉంటుంది. టాటా మోటర్స్ ప్రస్తుతం చాలా మంచి సేల్స్ ఉన్నాయి. రేట్లు ఇంకా ఫైనల్ కాకపోయినా కార్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.