Water crisis: హస్టల్‌లో నీరు లేక.. బావి నుండి తెచ్చుకుంటున్న బాలికలు 2024-06-27 16:10:30

న్యూస్ లైన్ డెస్క్: వసతి గృహంలో నీరు లేక.. బోరు బావి నుండి బాలికలు నీరు తెచ్చుకుంటున్నారు. పాలకుర్తి  కొడకండ్ల మండలం గిర్ణి తండాలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల వసతి గృహంలో పదిరోజుల నుంచి నీళ్లు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నీటి సదుపాయం లేకపోవడంతో పక్కనే ఉన్న బోరు బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. హస్టల్‌‌ యజమానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాలికలు వాపోయారు. నీరు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి హస్టల్‌కు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని బాలికలు కోరుతున్నారు.