పాక్ చేసిన విధ్వంసానికి ఇలా చెయ్యాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సస్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది .. పాకిస్థాన్ ,పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులకు పాల్పడింది. భారత ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ , నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులకు తమ సహాయం అందిస్తున్న పాకిస్థాన్ సంగతి చూస్తుంది. పాకిస్థాన్ లోని నాలుగు పీవోకేలో ఐదు చోట్ల అటాక్ చేసింది. తద్వారా ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న పాక్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. దీనిపై టీమ్ఇండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్ చేసిన విధ్వంసానికి ఇలా చెయ్యాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సస్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.