భారత అథ్లెట్ మనూ భాకర్ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: భారత అథ్లెట్ మనూ భాకర్ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మనూ భాకర్ తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ పోటీలో, ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. గతంలో భారత తరపున ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్లలో నార్మన్ ప్రిచార్డ్ ఉన్నారు. 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లోనే అతను ఆ రికార్డును అందుకున్నాడు. 200 మీటర్ల హార్డిల్స్, 200 మీటర్ల రేస్‌లో నార్మన్ ప్రిచార్డ్ సిల్వర్ పతకాలను గెలిచారు.
ఇప్పటి వరకు భారత్ తరపున రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన వాళ్లలో ప్రిచార్డ్, సుశీల్ కుమార్, పీవీ సింధు, భాకర్ ఉన్నారు. వారిలో ప్రిచార్డ్, భాకర్ మాత్రం ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్నారు. ఇక సుశీల్, సింధులు వేర్వేరు ఒలింపిక్స్‌లో పతకాలను కైవసం చేసుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ సుశీల్ కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించారు. ఇక మన హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు 2016 రియో గేమ్స్‌లో సిల్వర్ మెడల్, ఆ తర్వాత టోక్యో 2020 గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది.