"మనం నిలబడ్డాం... పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం... మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జనసేనపార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద నిర్వహించారు. ఈ సభలో జనసేనాని ..ఏపీ డిప్యూటీ సీఎం చాలా ఉద్వేగభరితంగా చాలా అంశాలపై ప్రసంగించారు. 2014 లో తానై అన్ని అయ్యి పార్టీ స్థాపించాను. చాలా కష్టాలు పడ్డాక 2019 లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయినా ఓ అడుగు ముందుకు వేశాం.
"మనం నిలబడ్డాం... పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం... మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. 2019 లో ఓడిపోతే ...నవ్వారు..రాజకీయాలకు పనికి రాడని పిచ్చి రాతలు రాశారు . ఇదేం న్యాయం అని మన జనసైనికులు, వీరమహిళలు అడిగితే, గొంతెత్తితే వాళ్లపై కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు.
అసెంబ్లీ గేటు ముట్టుకోలేవన్నారు. ఛాలెంజ్ చేసిన వారంతా నోరు మూసేలా ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతో పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీల తోటి అడుగుపెట్టాం.దేశం అంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించాం... ఇవాళ జయకేతనం ఎగరేస్తున్నాం.... జై జనసేన" అంటూ పవన్ ప్రసంగించారు.