Groups: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు అరెస్టు

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పోలీసులు గ్రూప్ 2 అభ్యర్థులను అరెస్టు చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721056219_sspolice.PNG

న్యూస్ లైన్ డెస్క్: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పోలీసులు గ్రూప్ 2 అభ్యర్థులను అరెస్టు చేశారు. గ్రూప్2, 3 పోస్టులను పెంచాలని గ్రూప్-2 ను డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు  ప్రయత్నించారు. దాంతో  పోలీసులు లైబ్రరీ గేటుకి లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. లైబ్రరీ లొనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను పోలీసుల అరెస్టు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. 

పోలీసుల దౌర్జన్యం: హరీష్ రావు


విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం అన్నారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని, నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana police dsc groups-aspirants arrest

Related Articles