Drugs : అమీర్ పేట్ హాస్టల్లో భారీగా డ్రగ్స్.. ఎలా పట్టుకున్నారంటే..

విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ నిల్వ ఉంచి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హాస్టళ్ల అడ్డాగా డ్రగ్స్ దందా సాగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు.


Published Aug 10, 2024 12:15:01 AM
postImages/2024-08-09/1723208241_drugsinameerpethostels.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. దీన్ని అణిచివేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డ్రగ్స్ ముఠాలు మాత్రం అంతకంతకు విస్తరిస్తున్నాయి. తాజాగా విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ నిల్వ ఉంచి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హాస్టళ్ల అడ్డాగా డ్రగ్స్ దందా సాగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్ లో నలుగురు యువకులు డ్రగ్స్ సేవిస్తుండగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ ఏరియాలో డ్రగ్స్ విక్రయం జరుగుతుందని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకార తనిఖీలు చేయగా యువకులతో పాటు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేసి నలుగురుయువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గత కొన్నిరోజులుగా ఎస్సార్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా  గంజాయి, డ్రగ్స్ దందా నడుస్తోంది. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న మోహిత్, రవూఫ్, పసుపులేటి తదితరులను అరెస్టు చేశారు. బెంగళూరునుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో రవూఫ్ కు నైజీరియాకు చెందిన నెగ్గెన్ అనే డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పరిధిలో 115 హాస్టళ్లలో పోలీస్ ల విస్తృత తనిఖీలు చేశారు. విద్యార్థులు ఉండే హాస్టల్లలో డ్రగ్స్ అమ్మకాలు చేపడతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news revanth-reddy hyderabad police cm-revanth-reddy -police- crime- crime drugs ameerpet

Related Articles