varalakshmi Vratam 2024 : పూజకు 10 నిమిషాల్లో చేసే 9 ప్రసాదాలు ఇవే !

పండుగ వచ్చిందంటే ప్రసాదాలే పెద్ద సమస్య..పెద్ద పెద్ద వంటలు పిల్లలతో చెయ్యలేం. చేశాక వదిలేస్తే తినలేం.


Published Aug 15, 2024 06:41:00 PM
postImages/2024-08-15/1723727527_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : పండుగ వచ్చిందంటే ప్రసాదాలే పెద్ద సమస్య..పెద్ద పెద్ద వంటలు పిల్లలతో చెయ్యలేం. చేశాక వదిలేస్తే తినలేం. అందుకే పిల్లలతో ఇరవై నిమిషాల్లో చేసేసే  9 ప్రసాదాలు చేసేసుకుందాం రండి.


* ఫస్ట్ ఆప్షన్ పులిహోర.. చింతపండు పులుపు కాని ..నిమ్మరసం కాని మీరు ముందు రోజు రాత్రి స్నానం చేసి.. శుభ్రంగా ఉన్నపుడు రసం తీసి పెట్టుకుంటే పొద్దున్నే పూజకు మరింత ఈజీగా పనైపోతుంది. ముందుగా చింతపండుని నానబెట్టి గుజ్జు తీయాలి.  గుజ్జు ను స్టవ్ మీద పెట్టుకొని కాసింత పసుపు, ఉప్పు వేసి చిక్కగా అయ్యేవరకు ఉంచుకుంటే ఈ చింతపండు గుజ్జు మీకు ఓ వారం పాటు ఉంటుంది. కూరలు లేని టైంలో బాగా యూజ్ అవుతుంది. హ్యాపీగా చేసుకోవచ్చు. ఈజీ కూడా..ట్రై చెయ్యండి.


* సెకండ్ ఆప్షన్ రవ్వకేసరి ..ఈ రవ్వకేసరిని ఉప్మా చేసినంత ఈజీ గా చేసుకోవచ్చు. చక్కగా నెయ్యి లో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ , నెయ్యి లో ఉప్మా రవ్వ ను వేపుకొని.. కాసిన్ని పాలు వేసుకొని బాగా మరిగాక ఈ రవ్వ వేసుకొండి...తర్వాత కాసింత పంచదార ...నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి తీసేసే ముందు మరో చెంచా నెయ్యి వేసుకుంటే సరి...రెడీ రవ్వ కేసరి.


* మీరు దద్యోజనం చేసుకోవడాన్ని ఈజీ అనకూడదు. ఎందుకంటే పెరుగు ఉప్పు మాత్రమే దీని టేస్ట్ కాదు...విధానం చేసే తీరు బాగుండాలి. అన్నం మెత్తగా అవ్వాలి. అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. ఈ దద్ద్యోజనం వేడి అన్నంలో కాసింత పెరుగు , ఉప్పు, పాలు వేసి కలుపుకోవాలి. దీనిలోకి కాసింత ఫ్రెష్ వెన్న వేస్తే ... లాస్ట్ లో పోపు వేసుకుంటే.. అధ్భుతహా అనుకొండి.


* స్వీట్ పొంగల్ ..స్వీట్ పొంగల్ కు పెద్ద టైం పట్టదు. ఫస్ట్ కాసింత బెల్లం పాకం పెట్టి పక్కనపెట్టుకొండి. రైస్ ను పెసరపప్పును...కుక్కర్ పెట్టుకొని ఉడికాక ..ఆపేసి ఈ బెల్లం పాకం వేసుకొని మరికొంత సేపు ఉడికించుకొండి. తర్వాత ఈ బెల్లం పాకం ఆ పప్పు , అన్నం కు యాడ్ చేసుకొని ..కాసింత పచ్చకర్పూరం , నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ , కాసింత నెయ్యి వేసుకొండి ..లాస్ట్ లో ఇలాచీ మర్చిపోకండి ఇంతే ఈజీ.


* వేల్ పొంగల్ ...మీరు స్వీట్ పొంగల్ చేసుకున్నపుడే కాస్త పప్పు అన్నం పక్కన పెట్టుకుంటే పని మరింత ఈజీ అయిపోతుంది. కాసింత నెయ్యి లో రెండు ఎండు మిర్చి , ఆవాలు, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని కూసింత ఇంగువ వేసుకొని బాగా మంచి అరోమా వచ్చాక ఈ పప్పు అన్నం కూసింత నీరు వేసి ...ఉప్పు వేసి లాస్ట్ లో నెయ్యి వేసుకొని పది నిమిషాలు ఉడికిసతే  సూపర్ అంతే. 


* ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఆవిరి కుడుములు...వరిపిండిని కాస్త తోప పెట్టండి. ఎలా అంటారా ...కాసింత నీరు మరిగించి దానికి తగిన పంచదార వేసి ...బాగా మరిగాక ..వరిపిండిని కొంచెం కొంచెంగా వేసి ఉడికించండి. బాగా ఉడికాక ...కొంచెం కొబ్బరి తురుమును మధ్యలో పెట్టి చిన్న కుడుముల్లా చేసుకొని మళ్లీ ఆవిరిపెట్టండి..అంతే అయిపోయింది.


* అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోంగూర పులిహోర..గోంగూర ఉడికించి ...కాసింత మిర్చి వేసి చిన్న చింతపండు వేసుకొని మిక్సీ చేసుకొండి. బాగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు,కరివేపాకు, ఎండుమిర్చి వేసి ..పోపు వేసుకొండి. అందులో గోంగూర మిక్సీ చేసుకున్నారు అది వేసి కాసింత పసుపు కలుపుకుంటే ..వేడి వేడి అన్నంలో ఈ పేస్ట్ లో కలిపి గాలికి ఆరాక నైవేద్యం  పెట్టుకొండి. చెప్పలేదని ఉప్పు వేసుకోవడం మానేయకండి. వేసుకొండి.


* గారెలు వేసుకొండి...చక్కగా పండుగ కదా..హ్యాపీ గా తినచ్చు..వేడి వేడి మినపవడలు వేస్తే సరి. మిక్సీ పట్టి కాసేపు ఫ్రిడ్జ్ లో పెడితే చక్కగా వడలు మెత్తగా వస్తాయి.


* కాస్త కొబ్బరి తురుము , పంచదార ,వేసి ...చపతీలు చేసి వాటి మధ్యలో పెట్టి కజ్జికాయల్లా ఫోల్డ్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసేయండి. అయిపోతుంది. సరి తొమ్మిది ప్రసాదాలు రెడీ.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu lakshmi sravanam

Related Articles