తాను పనిచేసే ఏజెన్సీ జీతం విషయంలో మోసం చేస్తోందని.. తమ శ్రమను దోచుకుంటుందని ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించింది ఓ సెక్యూరిటీ ఏజెన్సీ.
న్యూస్ లైన్ డెస్క్ : తాను పనిచేసే ఏజెన్సీ జీతం విషయంలో మోసం చేస్తోందని.. తమ శ్రమను దోచుకుంటుందని ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించింది ఓ సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ కు చెందిన రేణుక అనే మహిళ నాచారం ఈఎస్ఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది వేతనం నెలకు రూ.15 అని తెలిసి ఉద్యోగంలో చేరింది. అయితే.. ఆమెను ఉద్యోగంలో చేర్చుకున్న ఏజెన్సీ ఆమెకు వేతనంలో రూ.5 వేలు కోత పెట్టి నెలకు రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తోంది. దీనిపై పలుసార్లు రేణుక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు వేడుకున్న స్పందన రాకపోవడంతో రేణుక ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది. రెక్కాడితే గానీ డొక్కాడని తన కుటుంబానికి ఉద్యోగమే ఆసరా అని.. ప్రభుత్వం స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని వేడుకుంటోంది.