జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐసీయూలోని చిన్నారులకు చిన్న చిన్న గిఫ్ట్స్ ను బహుమతులు అందించారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పటిల్ ని మిస్ వరల్డ్ సుందరీ మణులంతా సందర్శించారు. ఏఐజీ హాస్పటిల్ ఛైర్మన్ డా. నాగేశ్వర్ రెడ్డి వారికి ఆసుపత్రి ప్రత్యేకతలను వివరించారు. తమ వద్ద జరుగుతున్న ట్రీట్మెంట్ ప్రాసెస్ ను , పరిశోదనలను వివరించారు.
జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐసీయూలోని చిన్నారులకు చిన్న చిన్న గిఫ్ట్స్ ను బహుమతులు అందించారు. సాయంత్రం మోడల్స్ హైదరాబాద్ చిలుకూరులోని ఎకో పార్క్‌కు వెళుతుండగా, మరో బృందం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత పిల్లలమర్రి మానును చూసేందుకు వెళ్తున్నారు. వీరి రాక సంధర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్టను , పోచంపల్లిని సందర్శించారు.