తెలంగాణ పర్యాటక సంస్థ విజయ్ విహార్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సుందరీమణులంతా ఫొటోఘూట్ లో పాల్గొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బుద్దవనంలో పర్యటించారు. వారికి గిరిజన , జానపద నృత్యకళాకారుల ఘనస్వాగతం పలికారు. అక్కడి పరిసరాలను చూసి వారంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. బౌధ్ధ థీమ్ పార్క్ లోని బుధ్ధవిగ్రహాల వద్ద జరిగిన ధ్యానం , ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంతకుముందు తెలంగాణ పర్యాటక సంస్థ విజయ్ విహార్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సుందరీమణులంతా ఫొటోఘూట్ లో పాల్గొన్నారు. బుధ్ధపౌర్ణమి సంధర్భంగా వారంతా బుద్దవనపర్యటనకు వచ్చినట్లు అక్కడి నిర్వహకులు తెలిపారు. ఇండియా, ఫిలిప్పీన్స్ , సింగపూర్ , శ్రీలంక , బంగ్లాదేశ్ , కంబోడియా, మయన్మార్ , వియత్నాం , జపాన్ , కజకిస్థాన్ , కిర్గిస్థాన్ , లెబనాన్ , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ , ఇండోనేషియా ,మంగోలియా , నేపాల్ , తుర్కియే , చైనా , థాయ్ లాండ్ ఆర్మేనియా దేశాలకు చెందిన బ్యూటీస్ అంతా ఈ రోజు బుధ్దవనం కు వచ్చిన వారిలో ఉన్నారు.