ఈ విషయంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఓ వీడియో రూపంలో అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేసి, మెగా డీఎస్సీని ప్రకటించాలని నిరుద్యోగులు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఓ వీడియో రూపంలో అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. టీజీపీఎస్‌స్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో తను ఫోన్‌లో డీఎస్పీ పరీక్షలు వాయిదా వేయాలని ఆయన కోరారు. నిరుద్యోగ విద్యార్థుల ఆవేదన, ఆందోళన గురించి చైర్మన్‌తో మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని పాటించాలని, గ్రూపు 2, 3లో అదనపు పోస్టులు పేంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని ఆయన చైర్మన్‌కు వివరించారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్ష రెండు రోజుల వ్యవధిలో ఉండడంతో విద్యార్థులు నష్టపోతారని, విద్యార్థులకు ఓ 3 నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. అన్నీ అంశాలపై చైర్మన్‌తో మాట్లాడడం జరిగిందని, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని మహేందర్ రెడ్డి మాట ఇచ్చారని కోదండరాం తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, నిరుద్యోగుల కోసం ఎప్పుడు తను ముందు ఉంటానాని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.