జమ్మూకశ్మీర్‌ను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, I.N.D.I.A అలయన్స్ మీద మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతిఒక్కరి మీద ఉందని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: త్వరలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోనుందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం జమ్మూకశ్మీర్‌లోని సంగల్‌దాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఈ నెల18న తొలి విడత, 25న రెండో విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది.
అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగల్‌దాన్ సభలో ఆయన మాట్లాడారు. ఇద్దరికి ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను కాజేశారని ఆయన ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, I.N.D.I.A అలయన్స్ మీద మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతిఒక్కరి మీద ఉందని ఆయన అన్నారు.