Weather forecast: అల్పపీడనంతో మళ్లీ వర్ష సూచన

పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. 


Published Aug 27, 2024 05:57:16 PM
postImages/2024-08-27/1724761636_rainsintelangana.jpg

న్యూస్ లైన్ డెస్క్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వతరరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29న తేదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. 

జూన్ మొదటి వారంలో మొదలైన రుతుపవనాలు మందకొడిగా సాగాయి. దీంతో ఆ నెలలో వర్షాలు సాధారణంగానే ఉన్నాయి. జూలైలో మొదటివారంలో కాస్తా తక్కువగా వర్షాలు కురిసినా.. జూలై చివరి వారం వచ్చే సరికి అల్పపీడనాల ప్రభావంతో సమృద్దిగానే వర్షాలు పడ్డాయి. ఆగస్టులో కాస్తా బ్రేక్ పరిస్ధితులు రాగా..నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో అనిచ్చితి ఏర్పడి వేడి వాతావరణం నెలకొంది.

రాబోయే రెండు వారాలు సాధారణ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. 29న అల్పపీడనం వల్ల భారీ వర్షాలు రానున్నట్లు తెలుస్తోంది. నిజామబాద్, కామారెడ్డి, మెదక్  పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి. కేవలం సంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు రాత్రి పూల కురిసే వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu telanganam rains weather-update weather-forecast rain-alert

Related Articles