RSP: రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ డ్రామాలు 2024-06-25 19:07:06

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమర్జెన్సీపై మంగళవారం ఎక్స్‌లో ట్విట్ చేశారు. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయింది. అదే ఎమర్జెన్సీ, ఆ ఎమర్జెన్సీకి నేటితో 50 ఏళ్లు పూర్తి అయ్యింది అని గుర్తు చేశారు. దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం కోసం రాజ్యాంగం అత్యంత ఘోరం ఏమిటంటే మనుషులు జీవించే హక్కు ఆర్టికల్ 21ని కూడా రద్దు చేశారని తెలిపారు. మనుషుల్ని రోడ్లపై పడుకోబెట్టి బలవంతంగా స్టెరిలైజ్( కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేశారన్నారు. అందరు ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేశారని, ఇదే పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుతామని తెగ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని మేమే కాపాడుతామంటూ, మరో వైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రేసు పార్టీ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తుందని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు.