అయితే ఎవరికైనా మృతి గురించిన అనుమానాలున్నా..తెలుసుకోవాలనుకుంటున్న 8712568495 నంబర్ ను కాంటాక్ట్ చెయ్యాలని కోరారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. కాచిగూడ రైల్వే పోలీస్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం 55 యేళ్ల గుర్తు తెలయని వ్యక్తి ఉప్పుగూడ - యాకుత్ పురా రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని ఒంటిపై ఆకుపచ్చ రంగు చొక్కా, నలుపు పాయింటు ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. అయితే ఎవరికైనా మృతి గురించిన అనుమానాలున్నా..తెలుసుకోవాలనుకుంటున్న 8712568495 నంబర్ ను కాంటాక్ట్ చెయ్యాలని కోరారు.