భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే.అయితే వనజీవి రామయ్య కు ప్రకృతి ప్రేమికులు నివాళులు అర్పిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రకృతి ప్రేమికుడు , పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు తన జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. దీని వల్ల ఆయన ఇంటి పేరు వనజీవి గా మారింది. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 2017 లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే.అయితే వనజీవి రామయ్య కు ప్రకృతి ప్రేమికులు నివాళులు అర్పిస్తున్నారు.