Teachers Day: గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణయ్య!

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలతో ప్రతి బడి, కళాశాల కళకళలాడుతుంటుంది. తమ ఉపాధ్యాయులను, అధ్యాపకులను సత్కరించుకుంటూ విద్యార్థిలోకం మురిసిపోతుంటుంది.


Published Sep 05, 2024 07:12:29 AM
postImages/2024-09-05/1725500549_sarvepalli.PNG

తెలంగాణం, స్పెషల్ డెస్క్: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలతో ప్రతి బడి, కళాశాల కళకళలాడుతుంటుంది. తమ ఉపాధ్యాయులను, అధ్యాపకులను సత్కరించుకుంటూ విద్యార్థిలోకం మురిసిపోతుంటుంది. ఉపాధ్యాయుడిగా జీవనం మొదలు పెట్టి అంచలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశమంతా నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1888 సెప్టెంబర్ 5న తిరుపతికి 66కిమీ.ల దూరంలోని తిరుత్తణి అనే గ్రామంలో ఆయన జన్మించారు. వీరిది అచ్చ తెలుగు కుటుంబం. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నుంచి వీరు తిరుత్తణికి వలస వెళ్లారు. అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య కాగా, తమిళనాట విద్యాభ్యాసం జరగడం వల్ల బడిలో రాధాకృష్ణన్‌ అయ్యిందని, అదే తర్వాతి కాలంలోనూ కొనసాగింది. అత్యంత పేదరికం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. 

రాజకీయవేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిన మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి. పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తిత్వం వారి సొంతం. మైసూరు, ఆంధ్ర, బెనారస్, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు బోధించారు. తత్వశాస్త్రంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు. 1952 నుంచి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించిన ఆయన.. 1962 నుంచి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. 1954లో భారతరత్న పురస్కారం పొందారు. ప్రపంచ దేశాల్లో భారతీయతను చాటిన తెలుగువాడు మన సర్వేపల్లి రాధాకృష్ణయ్య. 1962 నుంచి వారి పుట్టినరోజును యావత్ దేశం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది. Indian Philosophy, Kalki or The Future of Civilisation వంటి సుప్రసిద్ధ రచనలెన్నో చేశారు. 20 శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన తత్వవేత్తలలో ఒకరిగా చరిత్రకెక్కిన ఆయన 1975 ఏప్రిల్ 17న తుదిశ్వాస విడిచారు.

newsline-whatsapp-channel
Tags : india-people hyderabad school-teacher government-schools radhakrishna teacher

Related Articles