నిరుద్యోగుల ఉద్యమం రేవంత్ సర్కార్ మెడలు వంచింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ పోటీ పరీక్షల అభ్యర్థులు చేసిన పోరాటం ఫలించింది. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
న్యూస్ లైన్ డెస్క్ : నిరుద్యోగుల ఉద్యమం రేవంత్ సర్కార్ మెడలు వంచింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ పోటీ పరీక్షల అభ్యర్థులు చేసిన పోరాటం ఫలించింది. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని.. చదువుకునేందుకు సమయం లేదంటూ గ్రూప్ 2 అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిరుద్యోగుల ఆందోళనలను రేవంత్ సర్కార్ చాలా లైట్ తీసుకుంది. దీంతో.. ఆగ్రహించిన నిరుద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.
తాజాగా నిరుద్యోగులతో మాట్లాడిన కాంగ్రెస్ ప్రతినిధులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు నిరుద్యోగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. కాగా.. ఆగష్టు 6, 7 తేదీల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా పడింది.