TGPSC : నా రిటైర్మెంట్ లోపే గ్రూప్స్ ఐపోవాలే.. మహేందర్ రెడ్డి పట్టు!

 ఏ ఇద్దరు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నా.. వారి చర్చంతా డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షల చుట్టూనే సాగుతుంది. వాయిదా గురించి అభ్యర్థులు పోరాడుతుంటే టీజీపీఎస్సీ తన పని తాను చేసుకుపోతోంది. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇంత జరుగుతున్నా టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి మౌనంగానే ఉంటున్నారు. ఆయన మౌనం వెనక అసలు కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకు పరీక్షలు వాయిదా వేయలేకపోతోంది? దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి కారణంగానే వాయిదా వేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆ కారణం ఏంటి?


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721273388_IMG20240718WA0003.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ప్రజాభీష్టం మేరకు పాలన సాగితే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ, ఇప్పుడు నాయకుల ఆలోచనల బట్టే పాలన జరుగుతోంది. వాళ్లు ఏదనుకుంటే అది. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేం అన్నట్టు, అధికారంలో ఉన్న వాళ్లు ఏం అనుకుంటే అది జరగాల్సిందే. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగుల వాదనను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు. ప్రభుత్వం సంకల్పించినట్టుగానే డీఎస్సీ, గ్రూప్ 2,3 పరీక్షలు జరిగిపోవాల్సిందే. అరిచి గీపెట్టినా, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా అరెస్టులైనా చేస్తాం కానీ, పరీక్షలు ఆపే ప్రసక్తే లేదంటున్నారు పాలకులు.  

అయితే దీని వెనక ఉన్న అసలు కారణం.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పంతమేనన్న చర్చ జరుగుతోంది. తన హయాంలో కనీసం కొన్ని ఉద్యోగాలైనా భర్తీ చేయాలన్న గట్టి పట్టుదలతో ఆయన ఉన్నారని, అందుకే పరీక్షల వాయిదా వైపు ఆయన మొగ్గు చూపడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన కోరిక మేరకే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌తో మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో పదవి నుంచి తొలగిపోయేలోపు ఎన్నో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసేసి, తన హయాంలో ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవాలన్న ఆలోచన మహేందర్ రెడ్డిది అని తెలుస్తోంది. ఆ మార్క్ ఉండాలనే తలంపుతోనే నిరుద్యోగులు అంతగా ఆందోళనలు చేస్తున్నా ఏమాత్రం స్పందించడం లేదన్న చర్చ జరుగుతోంది. డిసెంబర్‌లోపే పరీక్షలు నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారంటున్నారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు తీసుకున్నారు. డీజీపీగా ఆయన పదవీకాలం ముగిసిపోయాక ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేసింది రేవంత్ సర్కార్. డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్‌ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌తో ఆయనకు 62 ఏళ్లు పూర్తవ్వబోతున్నాయి. దీంతో ఆయన పదవుల భర్తీపై గట్టి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇటు డీసీఎస్సీ, గ్రూప్ 2, 3 అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నా, పాదయాత్రలు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. వాళ్ల మానానా వాళ్లను వదిలేసి, తమ పని తాము చేసుకుపోతున్నారని ప్రభుత్వంపై, టీజీపీఎస్సీపై పలువురు ఆరోపిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy groups-aspirants tgspsc comptetive-exams

Related Articles