NBT నగర్‌లో ప్రతి వారం జరిగే మార్కెట్లో స్టాల్స్ పెట్టుకున్న వారి నుంచి కూడా మేయర్ రూ.100 వసూల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసు పెడుదాం అని వెళ్తే కేసు తీసుకోవొద్దు అని పోలీసులకు ఫోన్లు చేసి విజయలక్ష్మి ఒత్తిడి చేస్తున్నారని రాజు ముదిరాజ్ అనే వ్యక్తి ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: సమస్యలు చెప్పుకోవడానికి ఫోన్ చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి బండారం బయటపడింది. సమస్యలు కోసం అడిగిన కాలనీ వాసుల మీద మీ ఇల్లు కూలగొట్టిస్తా అని కేసులు పెట్టిస్తా అని ఆమె బెదిరించిందని ఓ బాధితుడు వాపోయాడు.
NBT నగర్‌లో ప్రతి వారం జరిగే మార్కెట్లో స్టాల్స్ పెట్టుకున్న వారి నుంచి కూడా మేయర్ రూ.100 వసూల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసు పెడుదాం అని వెళ్తే కేసు తీసుకోవొద్దు అని పోలీసులకు ఫోన్లు చేసి విజయలక్ష్మి ఒత్తిడి చేస్తున్నారని రాజు ముదిరాజ్ అనే వ్యక్తి ఆరోపించారు.
NBT నగర్ కాలనీలో సమస్యల కోసం ప్రత్యేక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో సంబంధిత అధికారులను యాడ్ చేశామని ఆయన తెలిపారు. అయితే, కాలనీ సమస్యలు అధికారులు దృష్టికి తీసుకువెళ్తున్న వారిపై మేయర్, ఆమెకు సంబంధించిన గుండాలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన అన్నారు. వందల మంది తమ ఇంటిపైకి వచ్చి బెదిరిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారని రాజు ముదిరాజ్ వాపోయాడు.