Hydra:హైడ్రా లిస్టులో  ఆ ప్రముఖుల పేర్లు..జాబితా చూస్తే షాకే.?

ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. హైదరాబాదులోని ప్రభుత్వ పరిధిలో ఉండే చెరువులు, కుంటలు, నాళాలు, ఇలా ఏది దొరికితే అది పూర్తిగా


Published Aug 26, 2024 10:19:42 AM
postImages/2024-08-26/1724647782_hyadra.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. హైదరాబాదులోని ప్రభుత్వ పరిధిలో ఉండే చెరువులు, కుంటలు, నాళాలు, ఇలా ఏది దొరికితే అది పూర్తిగా ఆక్రమించుకొని నిర్మాణాలు జరిపారు. వీరు పర్మిషన్లు కూడా తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మకాలు కూడా జరిపారు.  నిర్మాణాలపై ఇప్పటికే పలు ప్రభుత్వాలు నోటీసులు ఇచ్చిన ఎవరు భయపడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కన్నేసింది.

 వారు ఎంతటి వారైనా సరే అది ప్రభుత్వ భూమి అయితే తప్పనిసరిగా కూల్చివేస్తోంది. శాటిలైట్ మ్యాప్ ద్వారా ప్రభుత్వ భూములను గుర్తించి హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు.  అయితే తాజాగా నాగార్జున తుమ్మిడికుంట చెరువులో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూల్చివేశారు. ఇక ఇవే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ హైడ్రాలిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కూల్చివేతలతో 43 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ఇప్పటివరకు కూల్చివేసిన వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. వీరికి సంబంధించిన ఇంకా కొన్ని కూల్చివేతలు మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ కేంద్రమంత్రి పల్లంరాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించిన అక్రమ భూములను కూల్చివేసింది. కావేరి సీడ్స్ అధినేత భాస్కరరావు, చింతల్ కు చెందిన బిఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, అంతేకాకుండా గాజులరామారం, అమీర్ పేట్, బీజేఆర్ నగర్, బంజారాహిల్స్ లో కూడా పలు అక్రమ కట్టడాలు కూల్చివేయనున్నారు.

అంతేకాకుండా నందగిరి హిల్స్ లో  ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి సంబంధించిన దాన్ని కూడా కూల్చివేసేందుకు సిద్ధపడింది. అంతేకాకుండా ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మించిన భవనం కూడా కూల్చివేసినట్టు నివేదికలో పేర్కొన్నది. ఇదే కాకుండా ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్ సంబంధించిన కట్టడాలు కూడా కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రగతి నగర్ ఎర్రకుంటా, బోడుప్పల్ చెరువులోని అక్రమ నిర్మాణాలు, గండిపేట చెరువులోని నిర్మాణాలు పాముహౌజులు,  ఇక వీరే కాకుండా పలువురు ప్రముఖులకు చెందినటువంటి అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయబోతున్నట్టు హైడ్రా జాబితా తయారు చేసినట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : hyderabad cm-revanth-reddy nagarjuna hydra-commisioner hydra hydra-commissioner-ranganath

Related Articles