సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 7 గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి . దేశీయంగా తులం బంగారంపై..వెయ్యి రూపాయిలు దగ్గర తగ్గింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. నిన్న బంగారం 60 రూపాయిల మేర తగ్గింది. ఈ రోజు మరింత తగ్గింది. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 7 గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి . దేశీయంగా తులం బంగారంపై..వెయ్యి రూపాయిలు దగ్గర తగ్గింది.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ స్టార్ట్ అయ్యే సరికి పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాగేలా ఉండగా, కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.
రోజురోజుకు ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. అయితే తగ్గిందని హ్యాపీ గా అనుకోవడానికి లేదు..రేపు మరో రేటుతో రోజు రోజుకు షాక్ ఇస్తుంటుంది. అయితే బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. అప్పటి నంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరల్లో భారీగానే తగ్గుదల కనిపిస్తోంది.
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 అంటే గ్రాము బంగారం 22 క్యారట్లు అయితే 6679 రూపాయిలు కాగా 24 క్యారట్ల బంగారం అయితే 7286 రూపాయిలుగా నమోదవుతుంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఇంచు మించుగా అన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు అలానే నడుస్తున్నాయి
ఢిల్లీ:22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,001
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 తెలుగు రాష్ట్రాలన్నింటిలోను దాదాపు ఇదే రేటు కొనసాగుతుంది. ఇక బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.85,100 వద్ద ఉంది. బెంగుళూరు లో మాత్రం 83 వేల చిల్లర కు మార్కెట్ లో అమ్ముడవుతుంది.