Cyber: సైబర్ నేరాలకు పాల్పడిన భార్యాభర్తలు.. ఇద్దు అరెస్ట్

ఈజీ మనీ కోసం ఓ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్‌ నేరాలకు పాల్పడిన దంపతులను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు.


Published Sep 02, 2024 05:41:46 PM
postImages/2024-09-02/1725279106_crime.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఈజీ మనీ కోసం ఓ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్‌ నేరాలకు పాల్పడిన దంపతులను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో సైబర్ నేరాలకు భార్యాభర్తలు జసిల్, ప్రీతి పాల్పడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో 15 కేసుల్లో మూడు కోట్లకుపైగా తమిళనాడుకు చెందిన ఈ జంట దోచుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 150 సైబర్ దోపిడీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

సోమవారం టెక్నికల్ డేటా ఆధారంగా చెన్నైలో వరంగల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సైబర్ దోపిడీ జంటను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఇటివల కేటుగాళ్లు జోరుగా సైబర్‌ నేరాలకు పాల్పడుతన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అపరిచితులు ఫోన్‌, ఓటీపీ నెంబర్లు అడిగితే ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana police warangal chennai cyber-security

Related Articles