Vinod kumar: రేవంత్ అబద్ధాలకు ధీటుగా బదులిస్తాం

రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్‌లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమని వినోద్ కుమార్ కుండబద్దలు కొట్టారు. 


Published Jun 25, 2024 03:04:03 PM
postImages/2024-06-25/1719308043_Untitleddesign10.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇకపై సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) అబద్ధాలకు ధీటుగా బదులిస్తామని BRS నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod kumar) అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్(telangana bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం(press meet)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌(rajnath singh)తో కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్(Goebbels) తరహాలో మాట్లాడారని అన్నారు. సీఎం స్థానంలో ఉండి రెవంత్ రెడ్డి సైనిక్ స్కూల్(Sainik school)పై అబద్ధాలు మాట్లాడారని వెల్లడించారు. సైనిక్ స్కూల్‌ను కేసీఆర్ పట్టించుకోలేదనడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

సీఎం కార్యాలయంలో కేసీఆర్ కేంద్రానికి రాసిన ఉత్తరాలు ఉంటాయి.. వాటిని రేవంత్ ఓసారి చూడాలని వినోద్ కుమార్ సూచించారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ BRS అధికారంలో ఉన్న సమయంలోనే మంజూరు చేసారని తెలిపారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌(Manohar Parrikar)ను సైనిక్ స్కూల్ గురించి ఎన్నో సార్లు కలిశామని గుర్తుచేశారు. దివంగత అరుణ్ జైట్లీని కూడా BRS ఎంపీలుగా చాలా సార్లు కలిశామన్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్‌లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమని వినోద్ కుమార్ కుండబద్దలు కొట్టారు. 

రేవంత్ రెడ్డికి అదే పనిగా అబద్దాలు చెప్పడం అలవాటైందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై కూడా అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి యువతను రెచ్చగొట్టారని తెలిపారు. ఇకపై రేవంత్ అబద్ధాలకు ధీటుగా బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. రక్షణ శాఖ భూములపై కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి సమయం ఉంటే అప్పటి డిఫెన్స్ అధికారి జె ఆర్ కే రావుతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో నిజాయతీగా కోట్లాడింది BRS మాత్రమే అని.. ఇకముందు కూడా కొట్లాడుతామని వినోద్ కుమార్ అన్నారు. నీట్‌తో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రెవంత్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నీట్‌పై సుప్రీం కోర్టులో మంచి న్యాయవాదిని రాష్ట్రం తరపున నియమించి కొట్లాడాలని సూచించారు.

newsline-whatsapp-channel
Tags : kcr india-people ts-news newslinetelugu telanganam revanth vinod-kumar press-meet rajnath-singh goebbels sainik-school manohar-parrikar brs-

Related Articles