పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ , రేపు ఆరెంజ్ అలర్ట్ ఆ తర్వాత రెండు రోజులకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ . తెలంగాణలో ఈ నాలుగురోజులు వర్షాలు కురుస్తాయని చెప్పి రీసెంట్ గా ప్రవేశించిన రుతుపవనాల చాలా సరిగ్గా కదులుతున్నాయని ఐఎండీ పేర్కొంది. నిన్న మహబూబ్నగర్ జిల్లా వరకు విస్తరించాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని తెలిపింది.
తెలంగాణలో ఇవాళ , రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ తదుపరి రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5-7 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపింది. నిజానికి ఈ సారి సాధారణం కంటే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పింది. నిన్న తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఖాసీం పేలో అత్యధికంగా 11.4 సెమీ వర్షాపాతం నమోదయ్యింది.