ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడు బచనపేటకు చెందిన ఎం. కనకయ్యగా గుర్తించారు.
న్యూస్ లైన్ , డెస్క్ : తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్రోజివ్స్ పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 8 మంది కార్మికులనుతీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడు బచనపేటకు చెందిన ఎం. కనకయ్యగా గుర్తించారు. హైదరాబాద్ తరలిస్తున్న వ్యక్తి ప్రకాశ్ గా గుర్తించారు. భారీ శబ్ధంతో పేలడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు.దీని వల్ల కాస్త ప్రాణ నష్టం తగ్గిందనే చెప్పాలి. ఎమర్జెన్సీ సైరన్ తో యాజమాన్యం మరికొంతమంది కార్మికులను అప్రమత్తం చేసింది అయితే ఎవరినీ పరిశ్రమలోనకి అనుమతించకపోవడం వల్ల ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు.