Sajjanar: డిజిటల్ అరెస్టులపై సజ్జనార్ ఆసక్తికర ట్వీట్లు !

ఇండియన్ లా లో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సప్టే లేదు అర్ధం చేసుకొండి. నేరం ఎంత పెద్దది అయినా డిజిటల్ అరెస్ట్ చెయ్యలేరని తెలిపారు.


Published Dec 22, 2024 01:26:00 PM
postImages/2024-12-22/1734854279_18122023Sajjanar1a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహనా లోపమే ప్రధానకారణమని ఆర్టీసీ ఎండీ , ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ చెప్పారు. అసలు ఇండియన్ లా లో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సప్టే లేదు అర్ధం చేసుకొండి. నేరం ఎంత పెద్దది అయినా డిజిటల్ అరెస్ట్ చెయ్యలేరని తెలిపారు.


దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులను అరెస్ట్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తించండి. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి కారణం అవగాహనా లోపమే. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదు. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్ లైన్  ద్వారా బెదిరింపులకు పాల్పడవు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీలని అర్థం. ముందుగా మీకు ఇలాంటి ఫోన్స్ వస్తే ఫస్ట్ మీరు భయపడకుండా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్తానని చెప్పండి. అక్కడ నుంచి మీకు కావాల్సిన సమాచారం ఇవ్వగలనని చెప్పండి. ఫొటోలు ఉన్నాయని చెప్పినా...మీ సీక్రెట్స్ ఏమున్నా ...సైబర్ పోలీసులు సాయంతో మనం వాటిని బయటకి రాకుండా ఆపవచ్చు. భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండని తెలిపారు.


డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ కాల్ వస్తే భయపడకుండా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించండి’’ అంటూ సజ్జనార్ ప్రజలకు సూచించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam -police- arrest cyber-security

Related Articles