ప్రతి యేడాది ఈ నుమాయిష్ జనవరి 1 నుంచి ప్రారంభమై 46 రోజుల పాటు అంటే దాదాపు ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉండేది కాని ఈ యేడాది వాయిదా పడింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : హైదరాబాద్‌లోనే అతి పెద్ద ఎగ్జాబిషన్.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే నుమాయిష్.. ఈ ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్ వాసులకు మాత్రమే కాదు.. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ సారి నుమాయిష్ వాయిదా పడింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇక్కడ స్టాల్స్ పెడతారు. అయితే ప్రతి యేడాది ఈ నుమాయిష్ జనవరి 1 నుంచి ప్రారంభమై 46 రోజుల పాటు అంటే దాదాపు ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉండేది కాని ఈ యేడాది వాయిదా పడింది.
అయితే ఈ యేడాది ..జనవరి 3న ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ జరుగనుంది . ఈ సారి నుమాయిష్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు , మంత్రి కోమటటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ నుమాయిష్ లో దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. రకరకాల అరుదైన కళాఖండాలు దొరకాలంటే మాత్రం నుమాయిష్ కు వెళ్లాల్సిందే. ఈ 45 రోజులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అధ్భుతంగా ఉంటాయి.