బీజేపీ నేతలతో పాటు భక్తులు , హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్ధల పేర్లతో కూడిన కొన్ని ప్యాకెట్లను కూడా వారు గుర్తించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో చికెన్ బిర్యానీ పంపకం కలకలం రేపింది. హ్యాపీ బర్త్‌డే’, ‘మెర్రీ క్రిస్మస్’ అని ముద్రించిన ప్యాకెట్లు కనిపించడంతో ఇది అన్యమతప్రచారంలో భాగమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటనలో బీజేపీ నేతలతో పాటు భక్తులు , హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్ధల పేర్లతో కూడిన కొన్ని ప్యాకెట్లను కూడా వారు గుర్తించారు.
ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరగడం, పైగా ప్రధాన ఆలయం సమీపంలోని బిర్యానీ ప్యాకెట్లను పంచడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆలయ ప్రాంగణంలో అనే మతానికి చెందిన మాంసాహారం ప్యాకెట్ లను పంపిణీ చేసిన ఆలయ ప్రాంగణం లో యంత్రాంగం గమనించకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజన్న ఆలయంలో రోజుకో వివాదంతో మసకబారుతుంది . ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జరిగిన సంఘటనపై ఆలయ ఈవోతో పాటు పోలీసుల సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు.