VIRAL: ఓర్నీ ...ఇదేం బిజినెస్ టెక్నిక్ రా...స్వర్గంలో ఫ్లాట్లు అమ్ముతున్నారా ! 2024-06-27 18:54:03

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చంద్రుడిపై ( MOON) రియల్ ఎస్టేట్ జరుగుతుంది అది అందరికి తెలిసిందే అయితే చంద్రయాన్ 3 ( CHANDRAYAN3) ప్రాజెక్ట్ సక్సస్ అయ్యాక చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత  ల్యాండ్ అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి.


దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ ( ONLINE)  లో ప్రకటనలు గుప్పించాడు. చదరపు మీటర్ కు కేవలం వంద డాలర్లేనని చెబుతూ..బిజినెస్( BUSINESS)  మంచి జోరుగానే సాగిస్తున్నాడు. అంతేనా స్వర్గంలో దేవుడు ఇంటి పక్కన ఇల్లే మీది ...తీసుకొండి...రండి..మీ సమస్యలు డైరక్ట్ గా దేవున్నే అడిగెయ్యొచ్చు.


స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటయ్యా అనే వాళ్లకు ఇంకో షాకింగ్ విషయమూ చెప్పాడు. అదేంటంటే.. ఈ దందాకు దేవుడి అనుమతి కూడా ఉందట. 2017లో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో తాను ఈ రియల్ ఎస్టేట్ ప్రతిపాదనను ఆయన ముందుంచానని, దీనిని పరిశీలించి దేవుడు ఓకే చెప్పాడని చెబుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ..ప్రజలు స్థలాలు కొంటున్నారు.