అంబానీ ఇంట పెళ్ళా.. మజాకా..100ఫ్లైట్స్,3జెట్స్.!

ప్రపంచ కుబేరుల్లో ఒకరయినటువంటి ముఖేష్ అంబానీ అంటే తెలియని వారు ఉండరు. ఇండియాలో టాప్ రిచెస్ట్ మాన్ గా ఈయనే ఉన్నారు. అలాంటి దనికుడి ఇంట్లో పెళ్లంటే  ఆకాశమంత పందిరి భూమంతా సందడి అనే విధంగా ఉంటుంది. ముంబై నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో  వీరి పెళ్లి జూన్ 12వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక వీరి వివాహానికి విదేశీ వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలతో పాటుగా స్వదేశీ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సినీ స్టార్ అంతా హాజరవుతున్నారు.ప్రముఖులు పెళ్లి వేడుకకు రావడం కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, మరియు 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుందట. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ  సీఈఓ రాజన్ మెహ్ర అంబానీ  జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ధ్రువీకరణ చేశారు.వివాహానికి హాజరైనటువంటి అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీటిని ఉపయోగిస్తారట.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-11/1720711699_ambani.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరయినటువంటి ముఖేష్ అంబానీ అంటే తెలియని వారు ఉండరు. ఇండియాలో టాప్ రిచెస్ట్ మాన్ గా ఈయనే ఉన్నారు. అలాంటి దనికుడి ఇంట్లో పెళ్లంటే  ఆకాశమంత పందిరి భూమంతా సందడి అనే విధంగా ఉంటుంది. ఆ సామెతకు తగ్గట్టుగానే  అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకకు సిద్ధమైంది. ముంబై నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో  వీరి పెళ్లి జూన్ 12వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోతోంది.

ఇక వీరి వివాహానికి విదేశీ వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలతో పాటుగా స్వదేశీ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సినీ స్టార్ అంతా హాజరవుతున్నారు. ఇక ఇండియాకు వచ్చే విఐపిలందరికి అద్భుతమైన సౌకర్యాలతో, పాటు రాజ మర్యాదలు ఉండాలి. దానికోసం అంబానీ అద్భుతమైన ఏర్పాట్లు చేశారట.  దీనిలో భాగంగానే ప్రముఖులు పెళ్లి వేడుకకు రావడం కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, మరియు 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుందట.

క్లబ్ వన్ ఎయిర్ సంస్థ  సీఈఓ రాజన్ మెహ్ర అంబానీ  జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ధ్రువీకరణ చేశారు. వివాహానికి హాజరైనటువంటి అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీటిని ఉపయోగిస్తారట. 12 నుంచి 15 వరకు ముంబైలో విపరీతమైనటువంటి ట్రాపిక్ ఆంక్షలు  కూడా విధించనున్నారు. ఇక ఈ వివాహానికి విదేశాల నుంచి  ఈ ప్రముఖుల హాజరవుతారట.


HSBC గ్రూప్స్ చైర్మన్ మార్కు టక్కర్. 

 ఇండియా సంతతికి చెందినటువంటి అడోబ్ సీఈవో  శాంతన్ నారాయణన్.

 సౌదీ ఆరాంకో సీఈఓ అమిన్ నాసర్. 

సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జేలి.

 బీపీ సీఈఓ ముర్రే 

 వీరితోపాటు ఇంకొంతమంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.  అయితే ఈ వివాహ వేదిక సందర్భంగా  ముంబైలోని స్టార్ హోటల్స్ లో రేట్లు విపరీతంగా పెంచారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mumbai ananth-ambani radhika-marchant mukesh-ambani

Related Articles