ర్యాష్ డ్రైవింగ్ పై ర్యాపిడో డ్రైవర్ ను నిలదీసింది ఓ మహిళ. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ చాలా పెద్దది అయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఓ ర్యాపిడో డ్రైవర్ లేడీ ప్రయాణికురాలిని చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరులోని జయానగర్ లో బాటా షోరూమ్ సమీపంలో జరిగింది ఘటన . ర్యాష్ డ్రైవింగ్ పై ర్యాపిడో డ్రైవర్ ను నిలదీసింది ఓ మహిళ. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ చాలా పెద్దది అయ్యింది.
డ్రైవర్ కన్నడ మాట్లడడం ..మహిళ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.డబ్బులు ఇవ్వకుండా డ్రైవర్ హెల్మెట్ తీసుకొని వాదిస్తుండగా డ్రైవర్ కస్టమర్ ను చెంపదెబ్బ కొట్టడంతో ఆ మహిళ నేల పై పడిపోయింది. దీంతో సోషల్ మీడియా ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఈ ఘటన జూన్ 14న జరిగినట్లు తెలుస్తోంది. జ్వులెరీ షాపులో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు ఘటన జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంది. మార్గమధ్యలో ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాదు సిగ్నల్ కూడా జంప్ చేశాడు. బాధితురాలు ..ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏంటి పరిస్థితి అనేది ప్రయాణికురాలి వాదన. అయితే డ్రైవర్ మాత్రం కన్నడ లో మాట్లాడాలని కాసేపు డ్రైవింగ్ నా ఇష్టమంటూ మరి కాసేపు వాదించాడు.
Bengaluru @rapidobikeapp bike rider slaps customer as she allegedly questions him over rash driving and jumping signal
Lady falls to the ground after Rapido rider slaps her hard pic.twitter.com/eM4aec1NzW — nikesh singh (@nikeshs86) June 16, 2025