పెళ్లి వేడుకలో భాగంగా వరుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ధూమ్ 2 మూవీలో సూపర్ హిట్ టైటిల్ ట్రాక్ కు డాన్స్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పోర్చుగల్ లో ఓ వెడ్డింగ్ లో ఊహించని ఓ ఇన్సిడెంట్ జరిగింది. తన భార్య కోసం పెళ్లికొడుకు లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేలా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. బాలీవుడ్ ఐకానిక్ సాంగ్ " ధూమ్ అగైన్ " పాటకు అద్దిరిపోయే స్టెప్పులు వేశాడు. సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.
పెళ్లి వేడుకలో భాగంగా వరుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ధూమ్ 2 మూవీలో సూపర్ హిట్ టైటిల్ ట్రాక్ కు డాన్స్ చేశారు.ఈ పాటలో హృతిక్ రోషన్ తన అసాధారణమైన ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్‌తో ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పోర్చుగీస్ వరుడు కూడా హృతిక్ స్టెప్పులను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. పెళ్లి కూతురు ఆనందానికి హద్దులు లేవు.
ఈ వీడియోను 'లెటరింగ్‌బైసావ్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. "వెన్ ఎ వైట్ బాయ్ మ్యారీస్ ఎ బ్రౌన్ గర్ల్ " అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ డ్యాన్స్ ఏకంగా హృతిక్ రోషన్ వరకు వెళ్లడంతో ఆ వీడియోపై హృతిక్ రోషన్ రిప్లై ఇచ్చారు.