jawan: భారత్ జవాన్ చనిపోయిన 56 ఏళ్లకు అంత్యక్రియలు !

1968లో మల్ఖాన్‌సింగ్‌ బృందం ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-12 రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద ప్రమాదానికి గురైంది. మంచుకొండల్లో నాడు గల్లంతైన మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం


Published Oct 03, 2024 02:17:13 AM
postImages/2024-10-03/1727937992_12124315698722d837c164fbfafc0b633a7553b52.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జవాన్ జీవితమే కత్తి మీదసాము లాంటిది. జవాన్ గా చేరామంటేనే ..మన జీవితం దేశానికి అంకితం ఇచ్చినట్లే. ఇక్కడ అదే జరిగింది. భారత్ వాయుసేనలో చనిపోయిన జవాన్ కు 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు చేస్తుంది భారత  ప్రభుత్వం. 1968లో మల్ఖాన్‌సింగ్‌ బృందం ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-12 రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద ప్రమాదానికి గురైంది. మంచుకొండల్లో నాడు గల్లంతైన మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం.. ఇటీవల ఇండియన్‌ ఆర్మీకి దొరికింది. బ్యాడ్జి ఆధారంగా ఆయనను గుర్తించారు. ఇప్పుడు అధికారిక లాంచనాలతో ..అంత్యక్రియలు జరపుతుంది.  


ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం.. ఇటీవల ఇండియన్‌ ఆర్మీకి దొరికింది. బ్యాడ్జి ఆధారంగా ఆయనను గుర్తించారు. మల్ఖాన్‌సింగ్‌ పార్థివదేహానికి బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన ఫతేపుర్‌లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన 56 యేళ్ల తర్వాత అంత్యక్రియలు జరగడం చాలా బాధాకరం అయినా ..ఇప్పటికైనా మృతదేహాం లభించందంటున్నారు మల్ఖాన్ సింగ్ కుటుంబసభ్యులు. 


సియాచిన్‌ మంచుదిబ్బల్లో పూడుకుపోయినందున మల్ఖాన్‌సింగ్‌ మృతదేహం పూర్తిగా ఏమీ పాడవలేదని, కుటుంబసభ్యులు గుర్తుపట్టడానికి అనువుగానే ఉందని తెలిపారు. భారత వాయుసేన సిబ్బంది బుధవారం మధ్యాహ్న మల్ఖాన్ సింగ్ ను గ్రామానికి తీసుకురాగానే స్థానికులు అమర్ రహే అంటూ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. మల్ఖాన్‌సింగ్‌ తమ్ముడు ఇసమ్‌సింగ్‌ చాలా బాధపడ్డారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uttarapradesh indian-army

Related Articles