పుట్టిన బిడ్డను 21వ రోజున ఘనంగా ఉయ్యాల వేడుక చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆవు దూడకు నామకరణం ...ఏంటో ఆశ్చర్యంగా సెలబ్రేషన్స్ చేశారు. నూతన వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో అవు దూడను ఉంచి ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు. అచ్చు గుద్దున్నట్లు చంటిపిల్లలకు ఎలా అయితే చేస్తారో అలానే చేశారు. పుట్టిన బిడ్డను 21వ రోజున ఘనంగా ఉయ్యాల వేడుక చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల ఆవు దూడకు ఉయ్యాల ఫంక్షన్లో భాగంగా నామకరణం కార్యక్రమాన్ని గ్రామస్తులు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అడ్డాడ, రఘు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఈ నామకరణ వేడుక ఘనంగా నిర్వహించారు.
నామకరణంతో పాటు ఉయ్యాలలో కూడా వేశారు. ఆ ఉయ్యాలను బెలూన్లు, పూలతో డెకరేట్ చేశారు. అనంతరం ఆవు దూడకు శాస్త్రోత్తంగా నాగదేవిగా పేరు పెట్టారు . ఆ ఆవు దూడ పుట్టడానికి ముందు ఆవు దగ్గరకి పాములు వచ్చేవని అందుకే ఈ పేరు పెట్టామని తెలిపారు. ఈ ఆవు కి గతంలో అదే ఆలయం వద్ద శ్రీమంతం ఫంక్షన్ కూడా స్థానికులు నిర్వహించడం విశేషం. ఆలమందలను సైతం తమ కుటుంబ సభ్యులుగా భావించి నిడమర్రు గ్రామస్తులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం పట్ల వారిని పలువురు అభినందిస్తున్నారు.